సినిమా వార్తలు

‘సైరా’లో బిగ్ బీ లుక్ ఇదే!


11 months ago ‘సైరా’లో బిగ్ బీ లుక్ ఇదే!

నేడు(అక్టోబరు 11) బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పుట్టిన రోజు సందర్భంగా ‘సైరా’ చిత్ర యూనిట్ ఆయన లుక్‌ను రివీల్ చేస్తూ మోషన్ టీజర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రంలో అమితాబ్... చిరంజీవికి గురువుగా కనిపించనున్నారు. అమితాబ్ లుక్ అదుర్స్ అనిపించేలావుంది. ఈ సినిమాకు అమిత్ త్రివేది మ్యూజిక్ అందిస్తున్నారు. నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, బ్రహ్మాజీ, సుదీప్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రంగా సైరా నరసింహారెడ్డి రూపొందుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుత షెడ్యూల్‌ను జార్జియాలోని ఓ అద్భుత లొకేషన్‌లో చిత్రీకరిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.