సినిమా వార్తలు

కొత్త అనుష్కను చూశారా?


9 months ago కొత్త అనుష్కను చూశారా?

అందంతో పాటు అభినయం అనుష్క సొంతం. నాయిక ప్రాధాన్యత కలిగిన చిత్రాలను చేసి విజయాలను అందుకున్న ఘనత ఆమెకే దక్కింది. అలాంటి అనుష్క ఇటీవల కాలంలో సినిమాల సంఖ్య చాలా తగ్గించింది. కథాబలం కలిగిన సినిమాలు మాత్రమే చేయాలనే తన నిర్ణయమే అందుకు కారణమని ఇటీవల ఆమె చెప్పింది. అలాంటి అనుష్క 'భాగమతి' తరువాత మంచి కథ కోసం వెయిట్ చేస్తూ గ్యాప్ తీసుకుంది. కోన వెంకట్ వినిపించిన ఒక కథ నచ్చడంతో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ సినిమాకి ఆయన ఒక నిర్మాతగాను వ్యవహరిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా నుంచి అనుష్క పోస్టర్ ఒకటి విడుదల చేశారు. ఇప్పటివరకూ వచ్చిన అనుష్క లుక్స్ లో ఇది బెస్ట్ అనిపిస్తోందని కోన వెంకట్ అన్నారు. తమ సినిమా నుంచి వచ్చిన ఈ లుక్ తనకి బాగా నచ్చిందని పేర్కొన్నారు. నెమలి ఈక పట్టుకుని వున్న అనుష్క లుక్ అదుర్స్ అంటున్నారు అభిమానులు.