సినిమా వార్తలు

సైరా'లో నా పాత్ర సస్పెన్స్: తమన్నా


10 months ago సైరా'లో నా పాత్ర సస్పెన్స్: తమన్నా

తమన్నా తాజా చిత్రంగా 'నెక్స్ట్ ఏంటి' ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధ‌మ‌వుతోంది. సందీప్ కిషన్ జోడీగా ఆమె నటించిన ఈ సినిమాకి కునాల్ కోహ్లీ దర్శకుడు. ఈ సినిమాకి సంబంధించిన ఎక్కువభాగం షూటింగ్ 'లండన్' లో జరిగింది. రొమాంటిక్ లవ్ స్టోరీగా నిర్మితమైన ఈ సినిమాను, ఈ నెల 7వ తేదీన విడుదల చేయనున్నారు.  ఈ సందర్భంగా తమన్నా ఈ సినిమాను గురించి మాట్లాడుతూ, 'సైరా' సినిమాను గురించి కూడా చెప్పారు. చిరంజీవి కెరియర్లో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మితమవుతోన్న 'సైరా' సినిమాలో భాగస్వామి కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో నేను చేస్తోన్న పాత్ర ఏమిటనేది అప్పుడే చెప్పలేను .. ఇంకా షూటింగ్ చేయవల్సిన సన్నివేశాలు చాలా వున్నాయని అంది. దాంతో ఈ సినిమాలో తమన్నా పాత్ర ఎలా వుండనుందో .. ఎలా కనిపించనుందో అనేది ఆసక్తికరంగా మారింది. 'బాహుబలి' సినిమాలో నటించి మెప్పించిన తమన్నాకి, 'సైరా'వంటి మరో భారీ ప్రాజెక్టులో చోటు ద‌క్కింది.