సినిమా వార్తలు

అక్టోబరు 10న హలో గురు ప్రేమ కోసమే ట్రైలర్‌


1 year ago అక్టోబరు 10న హలో గురు ప్రేమ కోసమే ట్రైలర్‌

యువ హీరో రామ్‌ నటిస్తున్న చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే..’. త్రినాథ్‌రావు నక్కిన దర్శకుడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌. ప్రకాశ్‌రాజ్‌, ప్రణీత కీలక పాత్రల్లో క‌నిపించనున్నారు.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన వ‌చ్చింది. యూట్యూబ్‌లో 70 లక్షల మందికిపైగా ఈ వీడియోను వీక్షించారు. ఈ సినిమా ఆడియోను తాజాగా విడుదల చేశారు. కాగా ట్రైలర్‌ను అక్టోబరు 10న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. సినిమాను ప్రపంచ వ్యాప్తంగా దసరా సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ.. ‘సినిమాకు సంబంధించిన టీజ‌ర్‌కు అద్భుతమైన స్పందన వ‌చ్చింద‌న్నారు. మా పతాకం‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాల‌కు సంగీతం అందించిన రాక్‌స్టార్ దేవిశ్రీ ఈ చిత్రానికి సంగీతం స‌మ‌కూర్చారు. పాట‌లు మార్కెట్లోకి విడుద‌ల‌య్యాయి. ఈ నెల 10న ట్రైల‌ర్‌ను విడుదల చేయనున్నాం. అక్టోబరు 13న వైజాగ్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు.