సినిమా వార్తలు

అక్టోబర్ 18న ‘హలో గురు ప్రేమ కోసమే’


12 months ago అక్టోబర్ 18న ‘హలో గురు ప్రేమ కోసమే’

ఎనర్జిటిక్ స్టార్ రామ్... దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన డైరెక్షన్‌లో  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై బడా సినిమాల నిర్మాత దిల్‌రాజు  నిర్మిస్తున్న  మూవీ ‘హలో గురు ప్రేమ కోసమే’. ఈ సినిమాలో రామ్ సరసన కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. కొంతకాలంగా వరుస ప్లాప్‌తో సతమతమవుతున్న రామ్ ఈ సినిమా తనకు మంచి బ్రేక్ ఇస్తుందని భావిస్తున్నాడు.

లవ్ అండ్ కామెడి ఎంటర్ టైనర్‌గా తెరెక్కుతున్నా ఈ మూవీని దసరా కానుకగా అక్టోబర్ 18న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటివలే రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రాక్‌ స్టార్  దేవి శ్రీ ప్రసాద్  మ్యూజిక్  అందిస్తున్న ఈ  మూవీ నుండి   తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ పాటలో రామ్ ఇంతకుముందు కంటే హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ఇక  అనుపమ ఇప్పటి వరకు కనించిదానికి కంటే ఈ సినిమాలో కాస్త హాట్ కనిపించనుందని తెలుస్తోంది.