సినిమా వార్తలు

ఆయన 'మామ డ్యూటీ' లో బిజీ: ఉపాసన


11 months ago ఆయన 'మామ డ్యూటీ' లో బిజీ: ఉపాసన

సామాజిక మాధ్యమాల్లో నిత్యం యాక్టివ్ గా ఉంటూ, తన గురించి, తన భర్త రామ్ చరణ్ గురించిన కబుర్లను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కు చేరవేసే ఉపాసన పెట్టిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రస్తుతం ఏ విధమైన సినిమా షూటింగ్ లోనూ లేని రామ్ చరణ్, కుటుంబంతో గడుపుతూ, తన మేనకోడలి పుట్టిన రోజు వేడుకను దగ్గరుండి ఘనంగా నిర్వహించారు. ఇదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించిన ఉపాసన, "మామ డ్యూటీస్.. హ్యాపీ బర్త్ డే" అని వ్యాఖ్యానించింది. రామ్ చరణ్ మేనకోడలితో పాటు అల్లు అర్జున్ కుమారుడు అయాన్, మరికొందరు చిన్నారులు ఈ పిక్ లో ఉన్నారు. చెర్రీ తన మేనకోడలితో కేక్ కట్ చేయిస్తున్నప్పుడు తీసిన ఫొటో ఇది. ఈ పిక్ లో అయాన్, తదేకంగా కేక్ వైపే చూస్తున్నన్నాడు, దీంతో"అల్లువారబ్బాయి దృష్టంతా కేక్‌ పైనే ఉంది" అంటూ ఫ్యాన్స్ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.