సినిమా వార్తలు

బాలకృష్ణ ఎవరో తెలియదు: నాగబాబు


7 months ago బాలకృష్ణ ఎవరో తెలియదు: నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు ఒక‌ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్‌ ప్రస్తుతం ఇండ‌స్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. నందమూరి బాలకృష్ణ ఎవరో తనకు తెలియదని, ఆయన పేరు కూడా వినలేదని నాగ‌బాబు కామెంట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దర్శకుడు ఆర్జీవీ, నందమూరి బాలకృష్ణలపై నాగబాబు అభిప్రాయాన్ని తెలుసుకోవాల‌ని ఓ వ్యూయర్ ఈ ప్ర‌శ్న అడిగారు. దీనికి నాగ‌బాబు... ఆర్జీవీ గురించి మాట్లాడుతూ ఆయ‌న‌ గురించి మాట్లాడటం తనకు ఇష్టం లేదన్నారు. ఖైదీ నెంబర్ 150 పంక్షన్‌లో ఆయ‌న‌ గురించి చెప్పేశాను. ఆయన మాట్లాడే మాటల వల్ల స‌ద‌భిప్రాయం కూడా పోయింది. అతడి కూడా చెప్పడానికి ఏం లేదన్నారు. బాలయ్య బాబు గురించి చెప్పాలని అడగగా నాకు ఆయనెవరో తెలియదని కామెంట్ చేశారు. ఆ వెంటనే కంట్రోల్ చేసుకున్న‌ నాగబాబు.. బాలయ్యగారు పెద్ద ఆర్టిస్ట్. ఆయనను నేనేలా మరిచిపోతాను. నేరము శిక్షలో కృష్ణగారితో కలిసి నటించారని చెప్పారు. అయితే బాలయ్య అంటే నందమూరి బాలకృష్ణ అని యాంకర్ వివరించగా.. తనకు బాలకృష్ణ ఎవరో తెలియదని, ఆయన గురించి తానెప్పుడూ వినలేదని సింపుల్‌గా సమాధానమిచ్చారు. దీంతో యాంకర్ కు మ‌తిపోయినంత‌ప‌నైంది. నాగ‌బాబు కామెంట్లు విన్న బాలయ్య అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.