సినిమా వార్తలు

‘ఖడ్గం’నటితో ‘అవును’నటుడు చెట్టాపట్టాల్


9 months ago ‘ఖడ్గం’నటితో ‘అవును’నటుడు చెట్టాపట్టాల్

బాలీవుడ్‌ నటి, తెలుగులో ‘ఖడ్గం’ సినిమాలో నటించిన కిమ్‌ శర్మ, ‘అవును’ సినిమా ఫేం హర్షవర్ధన్‌ రాణేలు గత కొంత కాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారనే వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. దీనిపై మీడియాతో మాట్లాడిన హర్షవర్ధన్‌... ‘నేను చాలా ఓపెన్‌. ఇందులో దాయాల్సింది ఏమీలేదు. ప్రస్తుతం తన(కిమ్‌)తో రిలేషన్‌షిప్‌లో ఉన్నా. తన గురించి నాకు శ్రద్ధ ఉంటుంది కదా. అందుకే వ్యక్తిగత విషయాల గురించి చర్చించదలచుకోలేదు. టీనేజ్‌లోనే ఇంటి నుంచి పారిపోయి బయటికి వచ్చాను. సైబర్‌ కేఫ్‌లో కొన్నాళ్లు, ఎస్టీడీ బూత్‌లో మరికొంత కాలం పనిచేశాను. ఇప్పుడు నటుడిగా స్థిరపడ్డాను. నా జీవితం తెరచిన పుస్తకమే’ అంటూ హర్షవర్ధన్‌ చెప్పుకొచ్చాడు.

కాగా, షారుఖ్‌ఖాన్‌, అమితాబ్‌ బచ్చన్‌ నటించిన ‘మొహబ్బతే’ సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన కిమ్‌ శర్మ.. ఫిదా, తుమ్‌సే అచ్చా కౌన్‌ హై, కహెతా హై దిల్‌ బార్‌ బార్‌ వంటి సినిమాల్లో నటించారు. తెలుగులో ఖడ్గం సినిమాలో నటించిన ఈ భామ.. ‘మగధీర’లో ప్రత్యేక గీతంలో మెరిసింది. 2010లో వ్యాపారవేత్త అలీ పుంజానీని పెళ్లాడిన కిమ్‌... విభేదాల కారణంగా ప్రస్తుతం భర్తకు దూరంగా ఉంటోంది. ఇక తకిట తకిట సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన హర్షవర్ధన్‌... రవిబాబు ‘అవును’, ‘అవును2’ చిత్రాల ద్వారా పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల ‘ఫిదా’ సినిమాలో అతిథి పాత్రలో మెప్పించాడు.