సినిమా వార్తలు

ఆ ముగ్గురిని ఒప్పించే పనుల్లో హరీశ్ శంకర్


10 months ago ఆ ముగ్గురిని ఒప్పించే పనుల్లో హరీశ్ శంకర్

'దువ్వాడ జగన్నాథం' తరువాత దర్శకుడు హరీశ్ శంకర్ 'దాగుడుమూతలు' అనే టైటిల్ తో ఒక మల్టీ స్టారర్ చేయాలని భావించారు. ఆ ప్రాజెక్టు పట్టాలెక్కకపోవడంతో, తమిళంలో హిట్ కొట్టిన 'జిగర్తాండా'ను తెలుగులో రీమేక్ చేయడానికి బ‌రిలోకి దిగారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో 2014లో తమిళంలో వచ్చిన 'జిగర్తాండా' ఘన విజయాన్ని న‌మోదుచేసింది. ఈ సినిమా సిద్ధార్థ్ కి .. బాబీ సింహాకి మంచి పేరు తీసుకువ‌చ్చింది. ఇప్పుడు ఈ సినిమాల‌ను తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్న హరీశ్ శంకర్, నాగశౌర్య - రాజ్ తరుణ్ లను హీరోలుగా ఒప్పించేందుకు సంప్రదింపులు జరుపుతున్న‌రని స‌మాచారం. ఇక విలన్ పాత్రకి గాను వరుణ్ తేజ్ ను ఒప్పించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కథానాయికగా రష్మిక మందనను ఎంపిక‌చేశారు. అంతా అనుకున్నట్టుగా జరిగితే సెట్స్ పైకి ఈ సినిమా త్వ‌ర‌లోనే చేర‌నుంది.