సినిమా వార్తలు

హన్సికను ఇలా చూసుండరు


9 months ago హన్సికను ఇలా చూసుండరు

అందంతో పాటు అభినయంతో సౌత్ ఇండియాలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ హన్సిక. టాలీవుడ్, కోలీవుడ్ అగ్ర హీరోలతో కలిసి నటించిన ఈ భామ.. తన సినీ కెరీర్‌లో విజయవంతంగా 49 సినిమాలు పూర్తి చేసి మంచి క్రేజ్ దక్కించుకుంది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసి అగ్ర తారగా పేరు కొట్టేసింది. తాజాగా ఆమె తన 50 సినిమాకు శ్రీకారం చుట్టుంది. ‘మహా’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి జమీల్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా హన్సిక ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో.. తన పేస్ మాస్క్ లను చేతులో పట్టుకొని హన్సిక డిఫెరెంట్ లుక్‌లో అదరగొట్టేస్తోంది. ఇంతకుముందెన్నడూ చూడని హన్సికను ఈ సినిమాలో చూడవచ్చని తెలుస్తోంది. చిత్రానికి గిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నారు.