సినిమా వార్తలు

మరోమారు రాసీఖన్నాతో గోపీచంద్ రొమాన్స్


9 months ago మరోమారు రాసీఖన్నాతో గోపీచంద్ రొమాన్స్

హీరో గోపీచంద్ ఇటీవలి కాలంలో సరైన సక్సెస్ లు లేకపోవడంతో కొంత గ్యాప్ తీసుకుని మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నారు. తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేసేందుకు నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో గోపీచంద్ కొత్త మేకోవర్ తో కనిపిస్తాడని అంటున్నారు. అనీల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా రాశి ఖన్నాను ఎంపిక చేయనున్నట్టు సమాచారం.

ఇప్పటికే గోపీచంద్, రాశిఖన్నాల కాంబినేషన్ లో ‘జిల్’ సినిమా వచ్చింది. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జిల్’ మూవీ స్టైలిష్ చిత్రంగా ప్రశంసలు అందుకుంది. ఆ సినిమాలో గోపీచంద్- రాశిఖన్నాల రొమాన్స్ బాగా పండిందనే టాక్ వినిపించింది. ఇప్పటికే గోపీచంద్- రాశిఖన్నాల జంట ఆదరణ పొందిన కారణంగా మరో సారి వారినే ఖరారు చేయాలని దర్శకుడు తిరు నిర్ణయించుకున్నారట. వచ్చే ఏడాది ప్రారంభంలో సినిమాను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. మరోమారు తెరకెక్కనున్న ఈ జంట ఎంతవరకూ అలరిస్తుందో మరి.