సినిమా వార్తలు

యంగ్ టైగ‌ర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్


1 year ago యంగ్ టైగ‌ర్ ఫ్యాన్స్‌కు  గుడ్ న్యూస్

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే ఆయన నటించిన ‘అరవింద సమేత’ ప్రత్యేక షోల ప్ర‌ద‌ర్శ‌న‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్ర‌త్యేక అనుమతి ఇచ్చింది. ఉదయం 5 గంటల నుంచి 11 గంటల మధ్యలో రెండు ప్రత్యేక షోలను ప్రదర్శించేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. అక్టోబరు 11 నుంచి 18 వరకు మొత్తం రోజుకు ఆరు షోలు ప్రదర్శించనున్నారు. దీంతో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం అనుమతి పొందిన లేఖను విడుదల చేసింది. దసరా సెలవులు కావడం, భారీ బడ్జెట్‌తో సినిమాను తీయడంతో అనుమతి కోరుతున్నట్లు హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్ లేఖలో తెలిపింది. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించారు. ఎస్‌. రాధాకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. ఈషా రెబ్బా, సునీల్‌, జగపతిబాబు, నాగబాబు, నవీన్‌ చంద్ర, రావు రమేశ్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో క‌నిపించ‌నున్నారు.. పీఎస్‌ వినోద్‌ సినిమాటోగ్రఫీ అందించారు. తమన్‌ బాణీలు సమకూర్చారు. అక్టోబరు 11న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘రెడ్డి ఇక్కడ సూడు’ పాట ప్రోమోను మంగళవారం సాయంత్రం 4.50కు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.