సినిమా వార్తలు

చరణ్ అభిమానులకు శుభవార్త


8 months ago చరణ్ అభిమానులకు శుభవార్త

రామ్ చరణ్ కథానాయకుడిగా భారీ బడ్జెట్ తో 'వినయ విధేయ రామ' సినిమా నిర్మితమైంది. బోయపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా కైరా అద్వాని నటించింది. సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని మరో 3 రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకూ ఈ సినిమా స్పెషల్ షోలకి గాను ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. ఈ పండుగ రోజులలో ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకూ అదనంగా మరో రెండు షోలు వేస్తారు. ఇలా అదనపు షోలకి అనుమతి లభించడం వలన, ఈ సినిమా వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం కలుగుతోంది. బోయపాటి మార్క్ మాస్ సీన్స్, చరణ్ యాక్షన్, కైరా అద్వాని గ్లామర్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సినిమా చరణ్ కి మరో బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడం ఖాయమని ఆయన అభిమానులు అంటున్నారు.