సినిమా వార్తలు

మ‌గ‌ధీర‌తో గోల్డెన్ టైమ్‌: కాజ‌ల్‌


10 months ago మ‌గ‌ధీర‌తో గోల్డెన్ టైమ్‌: కాజ‌ల్‌

ప‌దేళ్లుగా ద‌క్షిణాదిన అగ్ర క‌థానాయిక‌గా కొన‌సాగుతున్న కాజ‌ల్ అగ‌ర్వాల్‌ తెలుగు, త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌ల్లో ప‌లువురు అగ్ర‌హీరోలతో న‌టించింది. త్వ‌ర‌లో అగ్ర‌ద‌ర్శ‌కుడు శంక‌ర్‌, టాప్‌ హీరో క‌మల్ హాస‌న్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న `భార‌తీయుడు-2`లో న‌టించ‌నుంది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో త‌న సినీ కెరీర్ గురించి కాజ‌ల్ ప్ర‌స్తావించింది. `నా కెరీర్‌లో చాలా ఘ‌న‌తలు సాధించాను. అయితే అవ‌న్నీ `మ‌గ‌ధీర‌` త‌ర్వాతే. ఆ సినిమా నా జీవితాన్ని మార్చింది. ఆ సినిమాతోనే నాకు గోల్డెన్ టైమ్ ప్రారంభ‌మైంది. `మ‌గ‌ధీర‌` ఇచ్చిన గుర్తింపును ఇప్ప‌టికీ ఎంజాయ్ చేస్తున్నా. ప్ర‌స్తుతం `భార‌తీయుడు-2`లో భాగ‌మైనందుకు ఎంతో సంతోషంగా ఫీల‌వుతున్నా. ఈ సినిమా కోసం కొత్త విద్యలు నేర్చుకుంటున్నా. ఈ సినిమా నా కెరీర్‌ను ఇంకాపై స్థాయికి తీసుకెళ్తుంద‌ని ఆశిస్తున్నానని కాజ‌ల్ తెలిపింది.