సినిమా వార్తలు

రీ ఎంట్రీకి సై అంటోన్న ‘బొమ్మరిల్లు’భామ


9 months ago రీ ఎంట్రీకి సై అంటోన్న ‘బొమ్మరిల్లు’భామ

తెలుగు తెరపై అందమైన కథానాయిక అనిపించుకున్నవాళ్లు లెక్కకుమించే ఉన్నారు. కానీ చిలిపి అల్లరి కథానాయిక అనిపించుకున్నది మాత్రం జెనీలియానే. 'బొమ్మరిల్లు' సినిమాతో జెనీలియా యూత్ హృదయాలను.. ఫ్యామిలీ ఆడియన్స్ మనసులను దోచేసుకుంది. కళ్లతోనే మాట్లాడగలిగే కథానాయికగా పేరు తెచ్చుకున్న జెనీలియా, వివాహం తరువాత నటనకు దూరమైంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన జెనీలియా .. ఇప్పుడు మళ్లీ నటనపై దృష్టి పెట్టిందని సమాచారం. ఇటీవలే 'మౌలి' అనే మరాఠీ సినిమాలో తన భర్త రితేష్ దేశ్ ముఖ్ తో కలిసి ఒక సాంగ్ లో నటించింది. తన స్థాయికి తగిన సినిమాలు వస్తే దక్షిణాదిలోను సినిమాలు చేయడానికి తాను సిద్ధంగానే ఉన్నానంటూ ఆమె ఇటీవల వెల్లడించింది. దీనిని చూస్తుంటే జెనీలియా తెలుగు తెరపై మళ్లీ కనిపించే అవకాశాలు వున్నాయనే తెలుస్తోంది.