సినిమా వార్తలు

నటిగా మారనున్న గీతా మాధురి


11 months ago నటిగా మారనున్న గీతా మాధురి

గాయినిగా అందరికీ తెలిసిన గీతామాధురి ‘బిగ్ బాస్-2’లో అభిమానులకు మరింతచేరువైంది. తాజాగా గీతా మాధుని సినిమాల్లో నటించేందుకు సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో గీతామాధురి ఓ థ్రిల్లర్‌, యాక్షన్‌ సినిమాలో ఆమె నటించనుందని సమాచారం! అయితే సినిమాల్లో నటించినంత మాత్రాన పాటలు పాడడం ఆపేదిలేదని గీతా మాధురి చెబుతోంది. మంచి కథతో తన దగ్గరకు వచ్చారనీ, కథ వినడంతోనే నచ్చడంతో ఓకే చెప్పానని గీతామాధురి అంటోంది. ఈ సినిమా గురించి ఇప్పుడే ఎక్కువ చెబితే బాగుండదని ఆమె అనుకుంటున్నట్లు సమాచారం.