సినిమా వార్తలు

సంక్రాంతి బరిలో 'ఎఫ్ 2'


10 months ago సంక్రాంతి బరిలో 'ఎఫ్ 2'

అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన 'పటాస్'.. 'సుప్రీమ్' .. 'రాజా ది గ్రేట్' సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ప్రతి సినిమా విజయంలోను కామెడీ ప్రధానంగా నిలిచింది. అందుకే ఈసారి కామెడీనే ప్రధాన కథాంశంగా ఎంచుకుని ఆయన 'ఎఫ్ 2' సినిమాను రూపొందిస్తున్నారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ కథానాయకులుగా చేసిన ఈ సినిమా ఇటీవలే షూటింగును పూర్తి చేసుకుంది. ఈ నెల 12వ తేదీన ఈ సినిమా టీజర్ విడుదల కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. 'మల్లీశ్వరి' తరువాత వెంకటేశ్ చేసిన పూర్తి వినోదభరిత చిత్రం ఇదేననే టాక్ వినిపిస్తోంది. ఇక ఇటువంటి సినిమా చేయడం వరుణ్ తేజ్ కి ఇదే మొదటిసారి. కామెడీని పండించడంలో వరుణ్ తేజ్ మెప్పిస్తే ఇక తిరుగులేనట్టేనని పలువురు అంటున్నారు. తమన్నా .. మెహ్రీన్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.