సినిమా వార్తలు

ఆపరేషన్ 2019 లోని మొదటి పాట విడుదల!


10 months ago ఆపరేషన్ 2019 లోని మొదటి పాట విడుదల!

పబ్లిక్ స్టార్ శ్రీకాంత్ నటించిన 'ఆపరేషన్ 2019' త్వరలో విడుదలకు సిద్దమవుతున్న విషయం మనకు విదితమే. ఆ చిత్రం లోని మొదటి పాటను ఈరోజు TV9 సీఈఓ రవి ప్రకాష్ గారు వారి ఛానల్ షో లో ఈ ఉదయం విడుదల చేశారు. 

వందేమాతరం అంటూ హిందీ లిరిక్స్ తో మొదలైన ఈ పాట, సుద్దాల అశోక్ తేజ కలం నుంచి జాలువారిన అద్భుతమైన లిరిక్స్ తో హృదయానికి హత్తుకునేలా సాగిపోయింది. వొళ్ళుగగుర్పొడితే దేశభక్తి గీతం గా ఇది నిలిచిపోతుందనటం లో అతిశయోక్తి లేదు. " నా  దేశమందు ఎందెందు వెదికినా తల్లిదనం, నా భూమిలోన ప్రతి కణం కణం లో దైవ గుణం" అంటూ , కీరవాణి తనయుడు కాల భైరవ ఎంతో ఉద్వేగం తో ఆలపించిన ఈ పాట సగటు ప్రేక్షకుడిలో దేశభక్తిని తట్టిలేపే విధంగా ఉంది. 

రాజకీయ నేపధ్యం తో సాగిపోయే ఈ చిత్రం ఎన్నికల సమయం లో విడుదల కావటం విశేషం. ఈ చిత్రానికి సంగీతం రాప్ రాక్ షకీల్ అందించారు. కారణం బాబ్జి దర్శకత్వం లో విడుదల కానున్న ఈ చిత్రం లో మంచు మనోజ్ , సునీల్ ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. శ్రీమతి అలివేలు నిర్మించిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.