సినిమా వార్తలు

దుల్కర్ సల్మాన్ పై లేడీ ఫ్యాన్స్ గుర్రు?


1 year ago దుల్కర్ సల్మాన్ పై లేడీ ఫ్యాన్స్ గుర్రు?

సావిత్రి జీవితచరిత్ర ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'మహానటి' తెరకెక్కింది. ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతూ 100 రోజులు ఆడేసింది. ఈ సినిమాలో సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించాడు. తాజాగా ఆయన ఈ సినిమాను గురించి ప్రస్తావించాడు. "మొదటి నుంచి కూడా నేను నా పాత్రలు కొత్తగా వుండాలని కోరుకుంటాను. నేను చేసిన ప్రతి సినిమా హిట్ కావాలని నేను కోరుకోను .. కొత్తగా కనిపించానా? లేదా? అనేది మాత్రం చూసుకుంటాను. అలాంటి కొత్తదనం కలిగిన పాత్ర గనుకనే నెగెటివ్ షేడ్స్ వున్నా, 'మహానటి'లో జెమినీ గణేశన్ పాత్రను పోషించాను. కానీ కొంతమంది లేడీ ఫ్యాన్స్ 'ఐ హేట్ యూ' అంటూ తిడుతూ కామెంట్స్ పెట్టారు. దీనిని బట్టి ఆ పాత్రను నేను బాగా చేశానని నాకు అర్థమవుతోంది. కొత్తదనం కోసం నేనుపడే తపనను వాళ్లు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను" అన్నాడు. ప్రస్తుతం ఆయన 'జోయా ఫ్యాక్టర్' అనే హిందీ సినిమా చేస్తున్నారు.