సినిమా వార్తలు

విజయ్ కి వదిన గా ఒకప్పటి ప్రముఖ హీరోయిన్!


11 months ago విజయ్ కి వదిన గా ఒకప్పటి ప్రముఖ హీరోయిన్!

విజయ్ దేవరకొండ 'టాక్సీ వాలా' విడుదలకు సిద్ధంగా ఉంది. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రం లో ఒకప్పటి అందాల భామ కళ్యాణి , విజయ్ కి వదిన నటించనుందట. ఒకప్పుడు కళ్యాణి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. రవి తేజ, జగపతి బాబు తదితర పెద్ద హీరోలతో తాను నటిస్తూ, డాన్స్ మాస్టర్ మరియు దర్శకుడు ఐన రాజశేఖర్ ని వివాహం చేసుకున్న పిదప సినీరంగానికి దూరమైంది. మల్లి ఇన్నాళ్ళకి ఈ టాక్సీవాలా తో రీఎంట్రీ ఇవ్వనుంది. 

నోటా పరాజయం తరువాత విజయ్ హీరోగా వస్తున్న టాక్సీవ్వాలా కి జోరుగా ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ చిత్రం విజయ్ కి ఎలాంటి పరిణామం ఇవ్వనుందో వేచి చూడాల్సిందే.