సినిమా వార్తలు

అలరిస్తున్న 'ఎఫ్ 2' సెకండ్ లిరికల్ సాంగ్


9 months ago అలరిస్తున్న 'ఎఫ్ 2' సెకండ్ లిరికల్ సాంగ్

దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన 'ఎఫ్ 2' సినిమా నుండి సెకండ్ లిరికల్ సాంగ్ ని చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. తమన్నా, మెహ్రీన్ కథానాయికలుగా కనిపించనున్న ఈ సినిమా, సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. "స్వర్గమే నేలపై వాలినట్టు, నింగిలోని తారలే చేతిలోకి జారినట్టు, గుండెలోన పూలవాన కురిసినట్టుగా ఎంతో ఫన్, ఎంతో ఫన్" అంటూ ఈ పాట వినిపిస్తుంది. ఈ పాట మేకింగ్ వీడియోకి సంబంధించిన దృశ్యాలపై ఈ వీడియోను తీర్చిదిద్దారు. వెంకటేశ్, తమన్నాలకి సంబంధించిన ఏదో వేడుకలో సరదాగా .. సందడిగా సాగే గ్రూప్ సాంగ్ లా ఈ పాట వస్తుందని తెలుస్తోంది. వెంకటేశ్, తమన్నాలు ఈ వీడియోలో అధికంగా కనిపిస్తున్నారు. ఈ సాంగ్ ను అనిల్ రావిపూడి మంచి కలర్ ఫుల్ గా చిత్రీకరించినట్టు ఈ వీడియోను చూస్తే ఇట్టే తెలుస్తోంది. ఈ సినిమాలో మరో హీరోగా వరుణ్ తేజ్ నటిస్తున్న విషయం విదితమే.