సినిమా వార్తలు

ఆకట్టుకుంటున్న ‘పడి పడి లేచె మనసు’ టీజర్


1 year ago ఆకట్టుకుంటున్న ‘పడి పడి లేచె మనసు’ టీజర్

హీరో శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘పడి పడి లేచె మనసు’ మూవీ టీజర్ విడుదలైంది.. హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి డాక్టర్‌గా, శర్వా ఫుట్‌బాల్ ప్లేయర్‌గా కనిపించనున్నారు. టీజర్‌లో సాయి పల్లవి ఎక్కడికి వెళితే అక్కడికి శర్వా ఫాలో అవుతున్నట్లు కనిపిస్తున్నాడు. సాయి పల్లవి ఓ రెస్టారెంట్‌లో ఉంటే అక్కడికి కూడా శర్వా వెళతాడు.

హీరోని గమనించిన సాయి పల్లవి శర్వా దగ్గరకు వెళ్లి.. ‘ఓయ్.. లేవయ్యా లే.. ఏంటి ఫాలో చేస్తున్నావా?’ అని అడుగుతుంది. ‘మీకు తెలిసిపోయిందా? అయినా మీరు ఇలా దగ్గరకు వచ్చి మాట్లాడటం ఏమీ బాగోలేదు... ఏదో నేను అర కిలోమీటరు దూరం నుంచి ప్రేమిస్తూ బతికేస్తుంటే’’ అని శర్వా అంటాడు. భారీ భారీ డైలాగ్స్ లేకుండా సింపుల్‌గా.. ఆకట్టుకునేలా టీజర్‌ను రూపొందించింది చిత్రబృందం. టీజర్‌ని బట్టి చూస్తే శర్వా అకౌంట్‌లో మరో హిట్ ఖాయమైనట్టు అనిపిస్తోంది.