సినిమా వార్తలు

ఎన్టీఆర్ కి క‌లిసొచ్చిన దసరా


11 months ago ఎన్టీఆర్ కి క‌లిసొచ్చిన దసరా

గ‌త రెండేళ్లుగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ దసరా బరిలో సినిమాలు విడుదల చేస్తూ విజ‌యాల‌ను అందుకుంటున్నారు. గత ఏడాది కళ్యాణ్ రామ్ నిర్మాతగా మంచి బడ్జెట్ తో బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాను... మహేష్ స్పైడర్ కు పోటీగా విడుదల చేసాడు.  జై లవ కుశ సినిమాను దసరా బరిలో సినిమా విడుదల చెయ్యడం వలన సూపర్ హిట్ కలెక్షన్స్ తో దూసుకుపోయింది. నిర్మాత కళ్యాణ్ రామ్ లాభాలు ఆర్జించారు. ఇక తాజాగా ఈ ఏడాది దసరా సెలవలకి త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక హాసిని బ్యానర్ లో అరవింద సమేత వీరరాఘవని దసరా సెలవులకి విడుదల చేసేలా ప్లాన్ చేసి సక్సెస్ అయ్యాడు. అయితే అరవింద సమేత ఫస్ట్ హాఫ్ క‌న్నా సెకండ్ హాఫ్ సూపర్ హిట్ అనే టాక్ వచ్చింది. సినిమా కలెక్షన్స్ పరంగా పాజిటివ్ గానే ఉంది. అరవింద సమేత గత గురువారం విడుదలై కలెక్షన్స్ అద్భుతంగా రాబడుతోంది.