సినిమా వార్తలు

వెండితెర తారకమ్మకు క్రిష్ శుభాకాంక్షలు


9 months ago వెండితెర తారకమ్మకు క్రిష్ శుభాకాంక్షలు

ఎన్టీఆర్ బయోపిక్ లో మొదటిభాగమైన 'కథానాయకుడు' విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ శ్రీమతి బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటించారు. ఆ పాత్రకి ఆమె నిండుదనాన్ని తీసుకొచ్చారనే టాక్ వినిపిస్తోంది. ఈ రోజున విద్యాబాలన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ బసవతారకం లుక్ తో వున్న విద్యాబాలన్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. "వెండితెర తారకమ్మగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. దివిలోని తారకరాముల తరఫున .. భువి పైన తెలుగువారందరి తరఫున .." అంటూ క్రిష్ ట్వీట్ చేశారు. ఇక తెలుగు ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరో పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇప్పటికే ఈ బయోపిక్ పై అంచనాలు ఒక రేంజ్ లో పెరిగిపోయాయి. జనవరి 9న రానున్న 'కథానాయకుడు' సంచలనానికి తెరతీయడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది