సినిమా వార్తలు

దిల్ రాజు సినిమాకు చైతూ అగ్రిమెంట్


7 months ago దిల్ రాజు సినిమాకు చైతూ అగ్రిమెంట్

ఇటీవల గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్ తో ఒక సినిమా చేయాలనే ఉద్దేశంతో దిల్ రాజు రంగంలోకి దిగారు. అయితే కొన్ని కారణాలతో ఆయన మనసు మార్చుకున్నారనీ, ఆ ప్రాజెక్టును నాగచైతన్యతో చేయనున్నారనే వార్తలు వినిపించాయి. అవినిజమేనన్నది తాజా సమాచారం. దిల్ రాజు నిర్మాణంలో .. శశి దర్శకత్వంలో ఈ సినిమా చేయడానికి అంగీకరిస్తూ చైతూ రీసెంట్ గా అగ్రిమెంట్ చేశాడని తెలుస్తోంది. కథా కథనాల్లోని కొత్తదనం కారణంగా ఈ సినిమా చేయడానికి చైతూ అంగీకరించాడని అంటున్నారు. ప్రస్తుతం చైతూ శివ నిర్వాణ దర్శకత్వంలో 'మజిలీ' సినిమా చేస్తున్నవిషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకోగా, ఇటీవలే 'వెంకీమామ' మొదలైంది. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమా పూర్తయిన తరువాత చైతూ .. శశితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడని తెలుస్తోంది.