సినిమా వార్తలు

మరో మల్టీస్టారర్‌ దిశగా దిల్ రాజు


12 months ago మరో మల్టీస్టారర్‌ దిశగా దిల్ రాజు

దిల్ రాజు బ్యానర్ నుండి ప్రతి ఏడాది అలరించే ఐదారు సినిమాలు వస్తుంటాయనే విషయం విదితమే. టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న పెద్ద ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజుకి ఉన్న విజయావకాశాలు మరెవరికీ లేవేమోననిపిస్తుంటుంది. చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాలు దాకా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ లో రూపొందిస్తుంటారు. రాజుకి స్క్రిప్ట్ నచ్చాలే కానీ ఎవరితో అయినా సినిమా చేసేందుకు ముందుకు వస్తుంటారు. ప్రస్తుతం దిల్ రాజు కాంపౌండ్ లో మరో స్క్రిప్ట్ కంప్లీట్ అయిందని సమాచారం.

‘సమ్మోహనం’తో  ప్రేక్షకులను ఆకట్టుకున్న మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో దిల్‌రాజు ఒక సినిమా నిర్మించనున్నారు. దానికి సంబంధించి మోహన్ కృష్ణ స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ చేశారని సమాచారం. గత మూడు నాలుగు నెలలుగా ఆయన కథపై వర్క్‌ చేశారు. కథ ప్రకారం ఇందులో ఇద్దరు హీరోలకు ఛాన్స్ ఉంది. మరి ఆ ఇద్దరు హీరోలు ఎవరు అనేది ఇంకా వెల్లడించలేదు దర్శకనిర్మాతలు. ఈ మల్టీస్టారర్‌ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’ విడుదల తర్వాత సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. మరోవైపు దిల్ రాజు బ్యానర్ లో ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఎఫ్‌2 చిత్రం షూటింగ్ చివరి దశలో ఉందని తెలుస్తోంది.