సినిమా వార్తలు

అశోక్ వ్యాఖ్యలపై దిల్ రాజు ఫైర్‌


9 months ago అశోక్ వ్యాఖ్యలపై దిల్ రాజు ఫైర్‌

సినీ నిర్మాతల మధ్య సంక్రాంతి సినిమాల విడుదలపై వివాదం నెల‌కొంది. థియేటర్ల లభ్యతపై వివిధ‌ వాదనలు వినిపిస్తున్నారు. ‘పేట’ ప్రీ-రిలీజ్ వేడుకలో ఆ చిత్ర నిర్మాత వల్లభనేని అశోక్ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 18 నుంచి థియేటర్లలో ‘పేట’ మాత్రమే ఉంటుందని అశోక్ అంటున్నారని, అలాంటప్పుడు 18నే ‘పేట’ను రిలీజ్ చేసుకోవచ్చు కదా? అని తిరిగి ప్ర‌శ్నించారు. సంక్రాంతికి మూడు పెద్ద తెలుగు సినిమాలు విడుదలవుతున్నప్పుడు... అనువాద చిత్రానికి థియేటర్లు ఎలా దొరుకుతాయని దిల్ రాజు ప్రశ్నించారు. తెలుగు సినిమాల విడుదల తేదీలను ఆరు నెలల క్రిత‌మే ప్రకటించామని, అశోక్ వ్యాఖ్యలు సమంజసం కాద‌ని అన్నారు.