సినిమా వార్తలు

ప్రభాస్ కోసం దిల్ రాజు వెయిటింగ్


7 months ago ప్రభాస్ కోసం దిల్ రాజు వెయిటింగ్

నిర్మాత దిల్ రాజు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'మున్నా' .. 'మిస్టర్ పర్ఫెక్ట్' సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. మరోసారి ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ .. సుజిత్ దర్శకత్వంలో 'సాహో' సినిమా చేస్తున్న విషయం విదితమే. ఇక 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ ప్రాజెక్టును కూడా పట్టాలెక్కించాడు. ఈ సినిమాకి 'జాన్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా తరువాత ప్రభాస్ .. 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయనున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మంచి కథను రెడీ చేయమని ఆయనకి ప్రభాస్ చెప్పారట. ఈ సినిమాను నిర్మించడానికి దిల్ రాజు ముందుకు వచ్చాడనేది తాజా సమాచారం. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించడానికి దిల్ రాజు తన సంసిద్ధతను వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఇక విభిన్నమైన కథాకథనాలతో ప్రభాస్ .. దిల్ రాజులను ఒప్పించవలసిన బాధ్యత ప్రశాంత్ నీల్ పైనే ఉందనే టాక్ వినిపిస్తోంది.