సినిమా వార్తలు

త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ‘దేవ‌దాస్‌’ రీమేక్


1 year ago త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ‘దేవ‌దాస్‌’ రీమేక్

వైజ‌యంతీ మూవీస్ తెర‌కెక్కించిన చిత్రం ‘దేవ‌దాస్‌’. నాగార్జున‌, నాని క‌ల‌సి న‌టిస్తున్న చిత్రం కావ‌డంతో ఈసినిమాపై ప్ర‌త్యేక దృష్టి నెలకొంది. తెలుగులో మంచి రేటుకి అమ్ముడుపోయిన ఈ సినిమా విడుద‌ల‌కు ముందే అశ్వ‌నీద‌త్‌కి లాభాల్ని తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాల‌నే ఆలోచ‌న‌లో అశ్వ‌నీద‌త్ ఉన్నారని సమాచారం ‌. వీలు చూసుకుని త‌మిళంలోనూ రీమేక్ చేస్తారని తెలుస్తోంది. నాగ్‌, నాని పాత్ర‌ల‌కు ఎవ‌రైతే బాగుంటార‌న్న విష‌యంలో ఇప్ప‌టికే ఓ అంచ‌నాకు వ‌చ్చేశార‌ని తెలుస్తోంది. త‌మిళంలో ఓ అగ్ర నిర్మాణ సంస్థ‌తో భాగ‌స్వామ్యం కుదుర్చుకుని.. అక్క‌డ రీమేక్ చేస్తారు. హిందీ కోసం వ‌యాకామ్ ఎలాగూ ఉంది. ఈనెల 27న `దేవ‌దాస్‌` విడుద‌ల కానుంది. ఇప్ప‌టికైతే పాజిటీవ్ బ‌జ్ న‌డుస్తోంది. లాబ్ రిపోర్టులు కూడా బాగా పాజిటీవ్‌గా ఉన్నాయి.