సినిమా వార్తలు

త్రివిక్రమ్ తో మిస్పయిన దేవరకొండ?


11 months ago త్రివిక్రమ్ తో మిస్పయిన దేవరకొండ?

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో రాత్రికిరాత్రే స్టార్ గా మారిన విజయ్ దేవరకొండకు వరస సినిమాల ఆఫర్లు వస్తున్న సంగతి తెలిసిందే. స్వల్ప కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్న విజయ్ తో సినిమా చేయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ‘అర్జున్ రెడ్డి’కి ముందు విజయ్ అంటే ఓ మాములు హీరో మాత్రమే. ‘అర్జున్ రెడ్డి’ తరువాతే విజయ్ కు ఎక్కువ ఆఫర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి.

అంతకముందు అల్లు అరవింద్ విజయ్ తో రెండు సినిమాలు ఒప్పందం చేసుకున్నారు. సరిగ్గా అదే సమయంలో విజయ్ కు త్రివిక్రమ్ ఆఫర్ వచ్చింది. అన్ని అనుకున్నట్టే జరిగితే త్రివిక్రమ్-దేవరకొండ కాంబోలో సినిమా ఈపాటికి విడుదలైవుండేదట. కానీ ఆ ప్రాజెక్ట్ జస్ట్ మిస్ అయ్యిందని సమాచారం. ఈ విషయమై రైటర్ లక్ష్మీ భూపాల ఓ ఇంటర్వ్యూ లో తెలిపారు. ఆ ప్రాజెక్ట్ కు కథ, మాటలు అన్ని నందినీ రెడ్డే. ఆ కథను తీసుకుని ఆమె త్రివిక్రమ్ దగ్గరకు వెళ్లి.. విజయ్ దేవరకొండతో సినిమా చేస్తే బాగుంటుందని కోరారు.

కానీ కథలో ఎక్కువ లేయర్స్ ఉన్నాయని, విజయ్ దేవరకొండతో పాటు మరికొంతమంది హీరోలు కూడా అవసరమని త్రివిక్రమ్ అన్నారట. ఆ టైంలో త్రివిక్రమ్ ఓ పెద్ద సినిమా పనుల్లో బిజీగా ఉండటంతో ఆ కథ అలా సెట్స్ మీదకు వెళ్లలేదు. ఆ తరువాత అది స్వప్నదత్ కారణంగా మళ్లీ బయటకు వచ్చింది. అంతేకాదు ఆ కథ ఓ కొత్త రూపం సంతరించుకుందని చెప్పుకొచ్చాడు లక్ష్మీ భూపాల. అది వెబ్ సిరీస్ గా మారిందన్నారు.