సినిమా వార్తలు

20న దేవదాస్ ఆడియో విడుద‌ల‌


1 year ago 20న దేవదాస్ ఆడియో  విడుద‌ల‌

నాగార్జున , నాని కలయికలో వ‌స్తున్న మల్టీస్టారర్ చిత్రం దేవదాస్. శ్రీ‌రామ్ ఆదిత్య తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్న‌, ఆకాంక్ష సింగ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. వైజ‌యంతి బ్యాన‌ర్ లో సి అశ్వినీద‌త్ నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబ‌ర్ 27న ఈ చిత్రం ప్ర‌పంచవ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ఆడియో విడుదల వేడుక ఈనెల 20న హైదరాబాద్లో జరిపేందుకు ప్లాన్ చేసారు. అదే రోజు అక్కినేని నాగేశ్వర‌ రావు జయంతి కావడం విశేషం. ఇప్పటికే చిత్రం లోని ఒక్కో సాంగ్ విడుదల చేస్తూ అంచనాలు పెంచేస్తున్నారు.