సినిమా వార్తలు

నోటా’ కొండను ఢీకొన్న విజయ్ దేవరకొండ


1 year ago నోటా’ కొండను ఢీకొన్న విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన 'నోటా' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు .. తమిళ భాషల్లో నిర్మితమైన ఈ సినిమా ఆసక్తికరమైన అంచనాల మధ్యనే థియేటర్స్ కి వచ్చింది. సమకాలీన రాజాకీయాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. చిత్రంపై టాక్ నెగటివ్ గా ఉన్నప్పటికీ, విజయ్ దేవరకొండకి గల క్రేజ్ కారణంగా ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయంటున్నారు.  ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి 7 కోట్ల 42 లక్షల షేర్ వచ్చిందని తెలుస్తోంది. 'గీత గోవిందం' లాంటి లవ్ స్టోరీ తరువాత విజయ్ దేవరకొండ ఈ సినిమా చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే తనకి రాజకీయాలంటే వున్న ఆసక్తి కారణంగానే ఈ సినిమా చేశానని విజయ్ చెప్పాడు. అస‌లు సినిమా చూసిన త‌ర్వాత దీనికి ఈ టైటిల్ ఎందుకు పెట్టారు అని ప్రేక్ష‌కులు అడుగుతున్నారట. "నోటా" అంటే ఎవ‌రికీ ఓటు వేయ‌క‌పోవ‌డం.. మ‌రి సినిమాలో అలాంటి స‌న్నివేశమే లేదు క‌దా వారు వాదిస్తున్నారట. దానికితోడు విజ‌య్ యాక్టింగ్ బాగున్నా క‌థ లేక‌పోవ‌డంతో అంచనాలకు షాక్ త‌గిలే ప‌రిస్థితి తలెత్తింది. త‌మిళ‌నాట అక్క‌డి పొలిటిక‌ల్ హీట్ ప్ల‌స్ ప‌రిస్థితుల వ‌ల్ల ఏదైనా మాయ జ‌రుగుతుందేమో కానీ తెలుగులో మాత్రం "నోటా"కు గట్టిగా ఎదురుగాలి వీస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఈ సినిమా బ‌య‌ట ప‌డ‌టం అంటే అసాధ్య‌మే అనికూడా వ్యాఖ్యానిస్తున్నారు. మ‌రోవైపు విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నా కూడా "ట్యాక్సీవాలా" వాయిదాపడుతూవస్తోంది. "డియ‌ర్ కామ్రేడ్" కూడా కొత్త ద‌ర్శ‌కుడితో చేస్తున్నాడు. అందుకే విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఇప్ప‌టివ‌ర‌కు న‌డిచిన టైమ్ కాదు.. ఇప్ప‌ట్నుంచి న‌డిచే టైమ్ మ‌రింత కీల‌కం కానుందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.