సినిమా వార్తలు

అఖిల్ సినిమాకు కౌంట్ డౌన్ స్టార్ట్స్‌


11 months ago అఖిల్ సినిమాకు కౌంట్ డౌన్ స్టార్ట్స్‌

అఖిల్ అక్కినేని తన మూడో సినిమాను 'తొలిప్రేమ' ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో చేస్తున్నారు.. టైటిల్ ను ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటించకపోయినా 'Mr.మజ్ను' అనే టైటిల్ ను ఫైనలైజ్ చేశారని స‌మాచారం. అదే టైటిల్ ను ఫిలిం ఛాంబర్ లో కూడా రిజిస్టర్ చేసిపెట్టారని తెలుస్తోంది. ఈ విషయంపై మరో మూడురోజుల్లో క్లారిటీ రానుంది. ఈ సినిమా ప్రీలుక్ ను తాజాగా రిలీజ్ చేసిన ఫిలిం యూనిట్ 19 వ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని తెలిపింది. ప్రీలుక్కే ఫస్ట్ లుక్ లా అనిపిస్తోంది. అఖిల్ రెండు చేతులు షారూఖ్ ఖాన్ స్టైల్ లో అలా చాపి ఒక పోజిచ్చాడు. చూస్తుంటే ఇది ఒక పాటలోని డాన్స్ స్టిల్ లా ఉంది.  ప్రీ లుక్కే ఇలా ఉంటే ఫస్ట్ లుక్ ఇంకా సూపర్ గా ఉంటుందని మనం ఆశించవచ్చు.  ఈ ప్రీలుక్ ను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసిన అఖిల్ 'మీరు రెడీనా.. మేము రెడీ.. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది." అంటూ ట్వీట్ చేశాడు. మెగా ప్రిన్స్ వరుణ్  తేజ్ కు 'తొలిప్రేమ' సినిమాతో మంచి హిట్ అందించిన వెంకీ అట్లూరి ఈ సినిమాతో అక్కినేని ప్రిన్స్ కు ఒక సూపర్ సూపర్ హిట్ అందిస్తాడని ఫ్యాన్స్ అందరూ నమ్మకం పెట్టుకున్నారు.