సినిమా వార్తలు

మహేష్ పై కమెడియన్ సంచలన కామెంట్లు


1 year ago మహేష్ పై కమెడియన్ సంచలన కామెంట్లు

టాలీవుడ్ లో సూపర్‌ స్టార్‌ అనిపించుకున్న నటుడు మహేష్ బాబు. ఇంతే కాదు నటుడిగానూ ఎన్నో అవార్డులు, రివార్డులను మహేష్ సొంతం చేసుకున్నారు. ఈ జనరేషన్‌ నటుల్లో అత్యధిక నంది అవార్డులు అందుకున్న నటుడు కూడా మహేష్ బాబు అనే విషయం అందరికీ విదితమే. ఇలాంటి ఓ టాప్‌ స్టార్‌పై ఓ తమిళ కమెడియన్ కామెంట్లు చేశాడు. తమిళనాట స్టాండప్‌ కమెడియన్‌గా గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న మనోజ్‌ ప్రభాకర్‌ పబ్లిసిటీ కోసం మహేష్ బాబు నటన మీద అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

స్పైడర్‌ సినిమాలో మహేష్‌, ఎస్‌జే సూర్యల నటనను పోలుస్తూ ‘మహేష్ బాబు కు అసలు నటనే రాదు, ఆయనది రాక్‌ ఫేస్‌.. స్పైడర్‌ సినిమాలో ఎస్‌జే సూర్య అద్భుతంగా నటిస్తుంటే హీరో మహేష్ మాత్రం ఎక్స్‌ప్రెషన్‌ లేకుండా అలా చూస్తుండిపోయాడు’ అంటూ కామెంట్ చేశాడు. అంతేకాదు స్క్రీన్‌ మీద పెద్దరాళ్లను చూపిస్తూ మహేష్ బాబు ముఖాన్ని ఆ రాళ్లతో పోల్చి పలు జోకులు పేల్చాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌కు కూడా నటన రాదన్న మనోజ్‌, మహేష్ బాబును కత్రినాకు మేల్‌ వర్షన్ అంటూ మరో కామెంట్ చేశాడు. దీంతో సూపర్‌ స్టార్ అభిమానులు మనోజ్‌ ప్రభాకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తప్పు తెలుసుకున్న మనోజ్‌ ఫేస్‌బుక్‌ ద్వారా సంజాయిషీ ఇచ్చుకునే ప్రయత్నం చేసినా మహేష్ అభిమానులు దిగిరావడం లేదు.