సినిమా వార్తలు

‘ఇంద చేట’ అలీకి 23న ఘన సన్మానం


8 months ago ‘ఇంద చేట’ అలీకి 23న ఘన సన్మానం

బాలనటుడిగా చిత్ర పరిశ్రమలో ప్రవేశించి నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకున్న అలీ ని ప్రముఖ సాంస్కృతిక సంస్థ సంగమం ఫిబ్రవరి 23 వ తేదీ న విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రం లో సన్మానించనుంది. నాలుగు దశాబ్దాల సినీ జీవిత మహోత్సవం పేరుతో ఒక కార్యక్రమం నిర్వహించి, స్వర్ణ కంకణం తో సత్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా ఏపీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు. పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.  ప్రెసిడెంట్ పేరమ్మ సినిమా ద్వారా టాలీవుడ్ లో ప్రవేశించిన అలీ సూపర్ హిట్ సీతాకోక చిలుక మూవీ లో నటించి, బెస్ట్ చైల్డ్ అవార్డ్ అందుకున్నారు. యమలీల మూవీ తో హీరోగా మారారు. హీరోలు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, పవన్ కళ్యాణ్ తో నటించారు. అలాగే మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్ వంటి స్టార్ హీరోల పక్కన నటించి ప్రేక్షకులను అమితంగా అలరించారు.