సినిమా వార్తలు

కలర్స్ స్వాతికి పంటిబాధ


9 months ago కలర్స్ స్వాతికి పంటిబాధ

తెలుగు .. తమిళ భాషల్లో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్వాతి, ఈ మధ్యనే పెళ్లి చేసుకుని ఇల్లాలిగా మారిపోయింది. తాజా ఇంటర్వ్యూలో ఆమె కొన్ని ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావించింది. "ఈ మధ్య కొత్తగా వచ్చిన దర్శకులు అద్భుతంగా సినిమాలు తీస్తున్నారు. అందుకే వారితో కలిసి పనిచేయాలనుకుంటున్నాను. నేను 'కలర్స్' చేస్తున్నప్పుడు పన్ను మీద పన్ను ఉండటం గురించి లొకేషన్స్ లో కొంతమంది మాట్లాడుకుంటుంటే బాధగా అనిపిస్తుండేది. ఇక హీరోయిన్ గా చేస్తున్నప్పుడు అంత తీసుకుంటుందట, ఇంత తీసుకుంటుందట అనే రూమర్స్ వచ్చాయి. నిజంగానే అంత పారితోషికం తీసుకుంటే బాగుండేది కదా అనిపించేది. ఇక ఎవరినైనా సరే నేను చాలా ఈజీగా నమ్ముతుంటాను. అలా నమ్మేసి ఆ తరువాత ఇబ్బందిపడిన సందర్భాలు చాలానే వున్నాయి, నాలో నాకు నచ్చనిది ఇదే. ఎవరు ఎలాంటి సలహాలు ఇచ్చినా మనసుకు నచ్చినది చేసుకుంటూ వెళ్లడమే నాకు తెలిసిన పని" అని స్వాతి చెప్పింది.