సినిమా వార్తలు

‘చిత్రలహరి’ షూటింగ్ ప్రారంభం


7 months ago ‘చిత్రలహరి’ షూటింగ్ ప్రారంభం

‘నేను శైలజ’ రూపొందించిన కిశోర్ తిరుమల దర్శకత్వంలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఓ చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. ‘చిత్ర లహరి’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా  ఈ చిత్ర పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ చిత్రాన్ని లాంచ్ చేశారు. రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటించనుంది.

రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనుండగా.. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందించనున్నారు. నవంబర్ 2వ తేది నుంచి సెట్స్ మీదకు వెళ్లే ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. వరుసగా ఐదు పరాజయాలతో ఢీలా పడ్డ సాయి ధరమ్ తేజ్ ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. ఉన్నది ఒక్కటే జిందగీతో పరాజయం పొందిన కిశోర్ తిరుమల ఈ మూవీతో ఎలాగైనా విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాడు.