సినిమా వార్తలు

చిరు ‘రైతు’ బాంధవుడు


7 months ago చిరు ‘రైతు’ బాంధవుడు

చిరంజీవి కథానాయకుడిగా ‘సైరా నరసింహారెడ్డి’ ఆన్ లొకేషన్‌లోవున్న సంగతి విదితమే. చిరు కెరీర్‌లో 151వ చిత్రం ఇది. జార్జియాలోని అరుదైన లొకేషన్లలో, టాప్ టెక్నీషియన్లతో ప్రస్తుతం మూవీకి సంబంధించిన పలు సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కేవలం క్లైమాక్స్ సన్నివేశాల కోసం 50 కోట్లు ఖర్చయిందని ఇటీవల ప్రచారం జరిగింది. సినిమా సెట్స్‌పై ఉండగానే చిరు నటించే 152వ సినిమా గురించిన ప్రచారం ఊపందుకుంటోంది. వరుస విజయాలతో ఎదురేలేని దర్శకుడిగా పాపులారిటీ తెచ్చుకున్న కొరటాల శివకు మెగాస్టార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని భోగట్టా. కొరటాల శివ ప్రస్తుతం చిరుకోసం స్క్రిప్టును పూర్తిచేసే పనిలో బిజీగా ఉన్నారు. భరత్ అనే నేను తర్వాత కొరటాల దృష్టంతా ఈ ప్రాజెక్టుపైనే నిలిపాడని సమాచారం. మూవీకి కావాల్సిన అన్ని రకాల విషయాల్ని మెగాస్టార్‌తో నేరుగా చర్చిస్తున్నారట. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి ప్రారంభం కానుందని, మార్చి లేదా ఏప్రిల్ 2019లో ప్రారంభమయ్యే సూచనలున్నాయని సమాచారం. దీనికి సంబంధించి తాజా సమాచారం బయటికి వెల్లడైంది. ఇందులో చిరు రైతు బాంధవుడిగా కనిపిస్తాడని తెలుస్తోంది. కథకు తగ్గట్టే ‘రైతు’ అనే టైటిల్‌ని అనుకుంటున్నారని తెలుస్తోంది.