సినిమా వార్తలు

అండర్ వాటర్లో చిరూ ఫైట్


9 months ago అండర్ వాటర్లో చిరూ ఫైట్

చిరంజీవి హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి 'సైరా' సినిమా రూపొందిస్తున్న విష‌యం విదిత‌మే. చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా నయనతార క‌నిపించ‌నుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి కీలకమైన సన్నివేశాల చిత్రీక‌ర‌ణ‌ను పూర్తిచేశారు. తదుపరి షెడ్యూల్లో అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీక‌ర‌ణ‌కు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ఈ తరహా యాక్షన్ సీన్స్ ను కంపోజ్ చేయడంలో నిపుణుల‌ను ముంబై నుంచి ర‌ప్పిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఏకధాటిగా కొన్ని రోజులపాటు అండర్ వాటర్లో యాక్షన్ దృశ్యాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. అండర్ వాటర్లో జరిగే ఈ యాక్షన్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయ‌ని చిత్ర యూనిట్ భావిస్తోంది. రిస్క్ తో కూడుకున్న ఈ సన్నివేశాల్లో చేయడానికి చిరంజీవి సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. వచ్చే వేసవి సెలవుల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.