సినిమా వార్తలు

ప్రముఖ షూటర్ వద్ద మెళుకువలు నేర్చుకున్న చిరంజీవి


11 months ago ప్రముఖ షూటర్ వద్ద మెళుకువలు నేర్చుకున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల జార్జియాలో ‘సైరా’ భారీషెడ్యుల్ ముగించుకుని ఇండియాకు తిరిగి వచ్చారు. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. 200 కోట్ల భారీ బడ్జెట్ లో రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. తాజాగా చిరు తుపాకీ షూటింగ్ కు సంబంధించిన మెళుకువలు నేర్చుకోవడం ఆసక్తిగా మారింది. షూటింగ్ ఛాంపియన్ గగన్ నారంగ్ ని హైదరాబాద్ లో చిరంజీవి కలిశారు.

నారంగ్ ప్రొఫెషనల్ షూటర్ కనుక  అన్ని రకాల తుపాకుల గురించి తెలుసు. షూటింగ్ లో అతనికి అద్భుత ప్రావీణ్యం ఉంది. దీనితో చిరు బ్రిటిష్ కాలం నాటి తుపాకులు, వాటిని వాడే విధానం గురించి నారంగ్ వద్ద మెళుకువలు నేర్చుకున్నారు. జార్జియాలో భారీ యుద్ధ సన్నివేశాలు పూర్తి చేసుకుని వచ్చిన సైరా టీం మరో మేజర్ షెడ్యూల్ కు సిద్ధం అవుతోంది. ఈ షెడ్యూల్ లో బ్రిటిష్ వారితో తుపాకులతో పోరాడే సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారని సమాచారం. మెగాస్టార్ చిరంజీవి తనని కలసిన విషయాన్ని గగన్ నారంగ్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవి గారితో షూటింగ్ గురించి చాలా విషయాలు సరదాగా చర్చించా అని నారంగ్ పేర్కొన్నారు. గగన్ నారంగ్ 2012 ఒలంపిక్స్ లో కాంస్యపతక విజేతగా నిలిచాడు. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు 2019 వేసవి సెలవుల్లో సైరా నరసింహా రెడ్డి చిత్రం విడుదల కానున్నట్లు సమాచారం.