సినిమా వార్తలు

అత్యంత ఆస‌క్తిక‌రంగా చెర్రీ టైటిల్‌


1 year ago అత్యంత ఆస‌క్తిక‌రంగా చెర్రీ టైటిల్‌

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే అధిక భాగం షూటింగ్ పూర్తిఅయిన‌ట్లు తెలుస్తోంది అయితే ఈ చిత్రానికి స్టేట్ రౌడీ, తమ్ముడు టైటిల్స్ చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా తాజాగా మరో ఇంట్రస్టింగ్ టైటిల్ తెరపైకి వచ్చింది. ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్‌ను కూడా ఈ చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు స‌మాచారం. ఈ చిత్రం అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ టైటిల్‌ను ఎంపిక‌చేసిన‌ట్లు సమాచారం. ఈ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య ఈ టైటిల్‌ను ఇప్పటికే ఫిలిం చాంబర్‌లో రిజిస్టర్ కూడా చేయించారట. గతంలో బోయపాటి… బెల్లంకొండ శ్రీను హీరోగా జయ జానకీ నాయక చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో ఈ చిత్ర టైటిల్ కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. దసరా కానుకగా ఈ చిత్రం ఫస్ట్ లూక్ పోస్టర్‌ను విడుదల చేసే అవకాశం ఉందని చిత్ర యూనిట్ తెలిపింది. అదే రోజు ఈ చిత్ర టైటిల్‌పై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల చేసేందుకు చిత్ర‌యూనిట్ స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.