సినిమా వార్తలు

ఐరన్ మ్యాన్ లుక్స్ తో చెర్రీ అదుర్స్!


9 months ago ఐరన్ మ్యాన్ లుక్స్ తో చెర్రీ అదుర్స్!

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,కైరా అద్వాని జంటగా నటించిన చిత్రం ‘వినయ విధేయ రామ’. ఈ రోజు ఈ చిత్రం విడుదలైంది. చిత్రంలో రామ్ చరణ్ ఐరన్ మ్యాన్ లుక్స్ తో అదరగొడుతున్నడనే టాక్ వినిపిస్తోంది. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ ప్రతి నాయకుడిగా నటించారు. ప్రశాంత్, స్నేహ, ఆర్యన్ రాజేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ సందర్భంగా బోయపాటి శ్రీను మీడియాతో మాట్లాడుతూ.. ఈ చిత్రంలో యాక్షన్ దృశ్యాలు వేటికవే ప్రత్యేకంగా ఉంటాయన్నారు. అజర్‌బైజాన్‌లో తెరకెక్కించిన పోరాట ఘట్టం అభిమానులకు నచ్చుతుందని అన్నారు రామ్ చరణ్ తన పాత్రకు తగ్గట్టు దేహదారుడ్యాన్ని మార్చుకున్నాడని బోయపాటి తెలిపారు. ఈ చిత్రంలో చెర్రీ ఐరన్ మ్యాన్‌లా కనిపిస్తాడని ఈ చిత్రానికి కర్త కర్మ క్రియ అన్నీ చెర్రీనేనని తెలిపారు.