సినిమా వార్తలు

నెదర్లాండ్స్ లో ఎంజాయ్ చేస్తున్న చైతూ, సమంత !


6 months ago నెదర్లాండ్స్ లో ఎంజాయ్ చేస్తున్న చైతూ, సమంత !

ప్రస్తుతం నెదర్లాండ్స్ లో నాగచైతన్య-సమంత జంట ఎంజాయ్ గా విహరిస్తున్నారు. ఈ ట్రిప్ ‘ది బెస్ట్’ అంటూ సమంత తన సంతోషం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా నెదర్లాండ్స్ లో దిగిన ఫొటోలను సమంత షేర్ చేసింది. ‘గొప్ప అంచనాలతో 2019లోకి అడుగుపెడుతున్నాం’, ‘నువ్వు నవ్వే విధానం’, ‘2019కి సిద్ధంగా ఉన్నా’, ‘నాట్ ఎలోన్’ అనే క్యాప్షన్స్ తో కొన్ని ఫొటోలను సమంత పోస్ట్ చేసింది. చలి దుస్తులు ధరించిన నాగచైతన్య-సమంతలు ఆనందంగా  వెళుతుండటం పాటు సమంత సింగిల్ గా ఫొటోలకు పోజిచ్చిన చిత్రాలను ఆ పోస్ట్ లో ఉంచింది. ఈ ఫొటోల్లో నాగచైతన్య, సమంతలు కొత్త లుక్ లో కనిపిస్తున్నారు. ఈ ఫొటోలను చూసిన వీరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.