సినిమా వార్తలు

‘స్టేట్ రౌడీ’గా చెర్రీ?


1 year ago ‘స్టేట్ రౌడీ’గా చెర్రీ?

గతంలో విజయాన్ని సాధించి నోళ్ల‌లో నానే సినిమా టైటిల్స్‌ను తిరిగి వాడటం పరిపాటి. ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ్ తన బాబాయి సినిమా టైటిల్‌ ‘తొలిప్రేమ’ను తన సినిమాకు పెట్టిన విషయం తెలిసిందే. అలాగే ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి టైటిల్‌ను వాడబోతున్నాడని తెలుస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చెర్రీ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు 'స్టేట్ రౌడీ' అనే టైటిల్‌ను పెట్టాలనే ఆలోచనలో చిత్రబృందం ఉందని తెలుస్తోంది. చిరంజీవి, రాధ జంటగా ఇదే టైటిల్ తో తెరకెక్కిన సినిమా 1989లో మంచి విజయాన్ని సాధించింది. ఈ క్రమంలో అప్పుడే ఈ సినిమా టైటిల్ ‘స్టేట్ రౌడీ’ అంటూ అభిమానులు తయారు చేసిన పోస్టర్లు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం చెర్రీ సినిమా షూటింగ్ యూరప్‌లోని అజర్‌బైజాన్‌లో జరుగుతోంది.