సినిమా వార్తలు

బాలయ్యను ఫాలో అవుతున్న చరణ్


11 months ago బాలయ్యను ఫాలో అవుతున్న చరణ్

లక్ష్మీనరసింహస్వామి అంటే దర్శకుడు బోయపాటి శ్రీనుతో పాటు హీరో బాలయ్యకి ఎంతో భక్తి! ఓ రకంగా చెప్పాలంటే వారిద్దరికీ సింహా అనేది సెంటిమెంట్‌ గామారిపోయింది. వారి ప్రతి సినిమాలోనూ ఏదో ఒక సందర్భంలో, సన్నివేశంలో లక్ష్మీనరసింహాస్వామి ప్రస్తావన వుండేలా  చూసుకుంటుంటారు. సింహా, లెజెండ్‌ సినిమాల్లో టెంపుల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సన్నివేశాలు లేదా ఫైట్లు తీశారు.  ప్రస్తుతం రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కిస్తున్న సినిమాలోనూ టెంపుల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సన్నివేశాలు తీశారు. 

సింహాచలంలో గల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో షూటింగ్ చేశారు. రామ్‌చరణ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సినిమా చిత్రీకరణ సింహాచల వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరిగింది. రామ్‌చరణ దర్శనం కోసం వెళుతున్న సన్నివేశాలను, మాడవీధుల్లో పల్లకీసేవ సన్నివేశాలను, ఆనంతరం భక్తులకు ప్రసాదాలు పంచిపెడుతున్న దృశ్యాలను బోయపాటి చిత్రీకరించారు. చరణ్‌తో పాటు స్నేహ, ఆర్యన్‌ రాజేశ్‌, ప్రశాంత్‌ తదితరులు షూటింగులో పాల్గొన్నారు. వచ్చే యేడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.