సినిమా వార్తలు

దీపావళికి చరణ్ కొత్త చిత్రం ఫస్టులుక్


11 months ago దీపావళికి చరణ్ కొత్త చిత్రం ఫస్టులుక్

బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ హీరోగా ఒక సినిమా రూపొందుతున్న విషయం విదితమే. ఇప్పటికే ఈ యాక్షన్ మూవీ చిత్రం చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా పనులు మరో నెల రోజుల్లో పూర్తికానున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాకి 'వినయ విధేయ రామా' అనే టైటిల్ ను నిశ్చయించారు. దసరాకి ఈ సినిమా నుంచి ఫస్టులుక్ వస్తుందనే టాక్ వినిపించింది. కానీ ఈ విషయంలో అభిమానులకు నిరాశే ఎదురైంది. టైటిల్ లోగోను ఖరారు చేసి దీపావళికి ఈ సినిమా ఫస్టులుక్ ను విడుదల చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందని సమాచారం. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 11వ తేదీన విడుదల చేయనున్నారు. అంతకు రెండు రోజుల ముందే ఎన్టీఆర్ బయోపిక్  విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాల మధ్య గట్టిపోటీ ఏర్పడే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో సీనియర్ హీరో ప్రశాంత్ నటిస్తున్నారు.