సినిమా వార్తలు

లారెన్స్ సినిమాలో శ్రీరెడ్డికి చాన్స్


1 year ago లారెన్స్ సినిమాలో శ్రీరెడ్డికి చాన్స్

కాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేస్తూ వార్తల్లోకి వచ్చిన శ్రీరెడ్డికి లారెన్స్ నిర్మించబోతున్న ఓ సినిమాలో చాన్స్ ద‌క్కించుకుంది. ఈ విషయాన్ని శ్రీరెడ్డి స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది.  "నా స్నేహితులందరికీ శుభవార్త. నేను లారెన్స్ ను ఆయన నివాసంలో కలుసుకున్నాను. ఆయన నాకు మంచి గౌరవాన్ని ఇచ్చారు. అక్కడ చాలా మంది పిల్లలున్నారు. వారంతా లారెన్స్ తో సంతోషంగా ఉన్నారు. నాకోసం ప్రార్థించారు కూడా. నేను ఆడిషన్స్ లో పాల్గొన్నాను. తన తదుపరి చిత్రంలో తీసుకుంటున్నానని హామీ ఇచ్చిన లారెన్స్, మంచి పాత్రను ఆఫర్ చేస్తానన్నాడు.

అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఈ డబ్బును నేను తిత్లీ తుపానుతో తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం ప్రజలకు విరాళంగా ఇస్తున్నాను" అని పేర్కొంది.  కాగా కాస్టింగ్ కౌచ్ అంటూ శ్రీ రెడ్డి చేసిన హంగామా అందరికీ తెలిసిందే. తనను లైంగికంగా వేధించారంటూ పలువురు సినీ నటుల పేర్లు బయటపెట్టిన ఈమె.. నటుడు లారెన్స్‌పై కూడా ఆరోపణలు గుప్పించారు. అయితే ఆ ఆరోపణలపై స్పందించిన లారెన్స్.. శ్రీ రెడ్డి చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని చెప్పడమే గాక ఆమెకు తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని ప్రకటించాడు కూడా. అయినా శ్రీ రెడ్డి మాత్రం లారెన్స్‌పై విరుచుకుపడటం ఆపలేదు. ఇదలా ఉంచితే.. తాజాగా శ్రీ రెడ్డి చేసిన పోస్ట్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.