సినిమా వార్తలు

సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న 'దేవదాస్'


1 year ago సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న 'దేవదాస్'

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున .. నాని కథానాయకులుగా 'దేవదాస్' సినిమా రూపొందింది. కామెడీ ఎంటర్టైనర్ గా నిర్మితమైన ఈ సినిమాలో నాగార్జున సరసన కథానాయికగా ఆకాంక్ష సింగ్ .. నాని జోడీగా రష్మిక మందన నటించారు. తాజాగా ఈ సినిమా సెన్సారు కార్యక్రమాలను పూర్తి చేసుకుని, యు/ఏ సర్టిఫికెట్ ను సంపాదించుకుంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాను ఈ నెల 27వ తేదీన విడుదల చేయనున్నారు. 

అటు నాగార్జున అభిమానులు .. ఇటు నాని ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకంతో అభిమానులు వున్నారు. నానీతో కలసి తాను నటించిన తాజా చిత్రం 'దేవదాస్' ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న నాగార్జున, హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతున్న వేళ 'దేవదాస్' స్టోరీ లైన్ ను చెప్పేశారు. తనకు డాన్ పాత్రలు కొత్తకాదని, అయితే, ఇందులోనే 'దేవ్' క్యారెక్టర్ వేరేగా ఉంటుందని చెప్పిన ఆయన, ఒక పేషంటుగా డాక్టర్ ను డాన్ కలుస్తాడని, వారిద్దరి మధ్య స్నేహం మొదలవుతుందని చెప్పారు.

ఆ డాన్ యువకుడిగా ఉన్న వయసు నుంచి న్యూస్ రీడర్ గా పనిచేస్తున్న ఓ అమ్మాయిని ఆరాధిస్తుంటాడని, అయితే, ఆమెను ఒక్కసారి కూడా కలుసుకోడని చెప్పారు. ఈ విషయాన్ని తెలుసుకున్న డాక్టర్, ఇద్దరినీ కలిపే కథే 'దేవదాస్' అన్నారు. డాన్ ను చూస్తే భయం కాబట్టి, ఇతరులు ఎవరూ మాట్లాడేందుకు కూడా సాహసం చేయరని, అందుకే అతనికి వైద్యం చేసిన డాక్టర్ దాస్, స్నేహితుడిగా మారతాడని, ఈ పాత్రలు రెండూ సినిమాలో చాలా హాస్యాన్ని పండించాయని తెలిపారు.