సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘హలో గురు ప్రేమకోసమే...'


1 year ago సెన్సార్ పూర్తి చేసుకున్న ‘హలో గురు ప్రేమకోసమే...'

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ పై రామ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన ‘హలో గురు ప్రేమకోసమే...’ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు సభ్యులు ఈ చిత్రానికి ఎలాంటి కత్తిరింపులు లేకుండా 'యూ' సర్టిఫికెట్ ని జారీ చేశారు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం దసరా పండుగ ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.