సినిమా వార్తలు

చిరంజీవి గారూ అని పిల‌వండిః అల్లు అర్జున్‌


9 months ago చిరంజీవి గారూ అని పిల‌వండిః అల్లు అర్జున్‌

ఎవ‌రైనా స‌రే ఎదుటి వ్యక్తిపై ఇష్టం ఉన్నా, లేకున్నా, నచ్చినా నచ్చక‌పోయినా ముందుగా వారిని గౌరవించడం నేర్చుకోవాలని హీరో అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు.  ‘పడి పడి లేచె మనసు’ ప్రీ రిలీజ్ వేడుక‌కు ముఖ్య అతిథిగా వచ్చిన బన్నీ, రాజకీయ నాయకులైనంత మాత్రాన గౌరవించకూడదని ఎక్క‌డా లేదు కదా? అని వ్యాఖ్యానించారు. ఇటీవల తాను టీవీ చూస్తుండ‌గా ఏదో ఓ కార్యక్రమంలో 'చిరంజీవిని పిలువు' అని అనడం వినిపించిందని, 'చిరంజీవి ఏంటి? చిరంజీవి గారు అని పిలవాల‌ని, ఎదుటి వ్యక్తులను గౌరవించాలి' అని  అర్జున్ సలహా ఇచ్చాడు. అయితే ఎవరిని ఉద్దేశించి ఆయ‌న‌ ఈ వ్యాఖ్యలు చేశారోగానీ, వీటిపై మీడియాలో చర్చ మొదలైంది. ఇదిలావుండ‌గా శర్వానంద్, సాయి పల్లవి నటించిన 'పడి పడి లేచె మనసు' ఈనెల 21న విడుదలకు సిద్ధమైంది.  'ప్రేమమ్‌', 'ఫిదా', 'ఎంసిఏ'లో సాయి పల్లవిని చూశానని, ఆమెతో డ్యాన్స్‌ ఎప్పుడు చేయాలా? అని ఎదురుచూస్తున్నానని అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు.